Welcome Settipally
DevelopmentsRotates&More
ప్రాజెక్ట్ – 1 : సెట్టిపల్లి అభివృద్ధి కార్యక్రమాలు
🔹 సెట్టిపల్లి శ్రీ రామస్వామి దేవాలయం
శ్రీ రాములవారిపై భక్తితో మరమ్మత్తుల నిమిత్తం రూ. 25,000 అందజేయడం జరిగింది. ప్రస్తుత పనులు పూర్తయ్యాక మరింత సహాయం చేయబడుతుంది.
🔹 సెట్టిపల్లి పాఠశాల
గౌరవనీయ ప్రధానోపాధ్యాయురాలి విజ్ఞప్తి మేరకు 20 x 60 అడుగుల షెడ్ మంజూరు చేయబడింది. ఈ పనిని కోతచెరువు వెల్డర్‌కు రూ. 95,000 వ్యయంతో అప్పగించాం.
🔹 సెట్టిపల్లి ఎడ్యుకేషనల్ అకాడమీ
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు ఒక హాల్ సిద్ధం చేయబడుతుంది. స్థలం మరియు తదుపరి నిర్ణయాలు గ్రామ ప్రజలతో చర్చించి త్వరలో ఖరారు చేయబడతాయి.
🔹 సెట్టిపల్లి అభివృద్ధి – వైద్య శిబిరాలు
త్వరలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడతాయి. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయబడుతుంది.
పై అన్ని కార్యక్రమాలు నా స్వర్గస్తులైన తండ్రి శ్రీ నాగరాజ స్వామి గారు మరియు తల్లి శ్రీమతి అన్నపూర్ణ గారి స్మారకార్థం నిర్వహించబడుతున్నవి.
సమాచారార్థం,
గిరి స్వామి
📞 9701609689































































































