Button Appears Here

[08:36, 31/5/2026] GIRI SWAMY ప్రతి ఆదివారం ఉదయం 7 లోపు గౌండ్ లో హాజరు అయ్యే పిల్లలకు పాలు , బ్రెడ్ లేదా బిస్కెట్ ఇస్తారు . . 7 గంటలకు అటెండెన్స్ వీడియో పెడతారు.. అందులో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు, 7 తర్వాత వచ్చి అడిగితె ఇవ్వరు ... ఎవరి గ్లాస్ వారే తెచ్చుకోవాలి. గ్లాస్ లు ఇవ్వబడవు. 


ఆదివారం పాలు పొయ్యడానికి ఎవరైనా రైతులు ముందుకు రావచ్చు ... ధర చెప్పండి, పే చేస్తారు ... ఆవు పాలు పిల్లల కోసం, మంచి క్వాలిటీ పోయాలి, నీళ్లు కలిపి ఇవ్వరాదు .. 


గిరి స్వామి

[20:33, 30/5/2026] GIRI SWAMY .: 🌺 శెట్టిపల్లి అభ్యుదయ వేదిక 🌺 🙏 వినాయక చవితి మహోత్సవ ఆహ్వానం 🙏 📅 తేదీ : 14 సెప్టెంబర్ 2026 నుండి 🪔 మొత్తం : *11 రోజుల పాటు మహోత్సవ కార్యక్రమాలు* *శ్రీ వినాయక స్వామి వారి ఆశీస్సులతో, శెట్టిపల్లి అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడును.* *ఈ ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సర భాద్రపద మాస శుద్ధ తదియ సోమవారం వినాయక చవితి రావడం విశేషం. ఈ సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక రుద్రాభిషేకము నిర్వహించబడును.* 🙏 *తప్పకుండ పాల్గొని శ్రీ వినాయక స్వామి మరియు పరమేశ్వరుని అనుగ్రహం పొందవలసిందిగా మనవి.* 🌿 *ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానమాచరించి, శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించి, కుటుంబ సభ్యులు మరియు చిన్నపిల్లలతో కలిసి కార్యక్రమానికి హాజరు కావలసిందిగా మనవి.* 🕕 *స్వామి వారు ఉదయాన్నే విచ్చేసి కార్యక్రమాలు నిర్వహించనున్నందున, అందరూ ఉదయం 6 గంటలకల్లా సిద్ధంగా రావలసిందిగా కోరుచున్నాము.* 🌸 *వీలు ఉన్నంత వరకు వివిధ రకాల పత్రి, పుష్పాలు మరియు మీకు తోచిన పూజా ద్రవ్యాలు తీసుకురావచ్చు.* 🪔 *పూజా సామాగ్రి మొత్తం శెట్టిపల్లి అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది.* *ప్రతి రోజు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతులు మరియు భక్తి కార్యక్రమాలు జరుగును. గ్రామ ప్రజలందరూ ఉదయ వేళలలో జరిగే పూజల్లో పాల్గొనవలసిందిగా మనవి.* 💐 ముఖ్య సమాచారం: ✅ ప్రతి రోజు పూజా కార్యక్రమాలు ✅ ప్రత్యేక రుద్రాభిషేకము ✅ సాయంత్రం ప్రసాద వితరణ ✅ భజన కార్యక్రమాలు ✅ సాంస్కృతిక కార్యక్రమాలు ✅ గ్రామ ప్రజల సమిష్టి భాగస్వామ్యం 🎶 *భజన మండలి బృందాలకు ప్రత్యేక ఆహ్వానం.* మీ బృందాలతో విచ్చేసి భక్తి కార్యక్రమాలలో పాల్గొనగలరు. 💰 ఎటువంటి రుసుములు లేవు. 🙏 గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం. 🌺 *మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని శ్రీ వినాయక స్వామి వారిని ప్రార్థిస్తూ…* 🌺 📍 నిర్వహణ: శ్రీ గిరి స్వామి శెట్టిపల్లి అభ్యుదయ వేదిక ✨ “సమిష్టి భక్తి – గ్రామ అభ్యుదయం” ✨


[21:41, 30/5/2026] GIRI SWAMY .: వచ్చేది వర్షాకాలం . . శెట్టిపల్లి లో వర్షం సమస్యలు ఏవైనా ఉంటె ఇప్పుడే చెప్పండి ... సాయంత్రం పూట అభ్యుదయ వేదికకు రండి చర్చ చేయండి, ఎం కావాలో రాయండి ...అప్పటికి అప్పుడు సహాయం అడిగితె చెయ్యలేక పోవచ్చు .. గమనిక : మీ సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ... వద్దు అనుకునే వారి గురించి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, పేద మరియు మధ్య తరగతి ప్రజలు మా సేవలను తీసుకోవచ్చు .. కులమత , రాజకీయ బేధాలు లేకుండా అభ్యుదయ వేదిక పని చేస్తుంది. గిరి స్వామి

[06:37, 1/6/2026] SETTIPALLI MEMBER 3.: గౌరవనీయులైన గిరిస్వామికి.. నమస్కరించి వ్రాయునది ఏమనగా....... శెట్టిపల్లి లో దాదాపుగా 1000 కుటుంబాలు వున్నాయి.. స్వామి దగ్గర దగ్గరగా 4000 మంది ప్రజలు వున్నారు.. ప్రతి రోజు నిత్యం ఇంటి సరుకుల కోసం పెనుకొండకు పోవాలి.. లేదా అధిక వ్యయంతో నిత్యావసరుకులు కొనుకోవాలి... పెనుకొండ పోవు రాను ఖర్చులు 100rs అవుతున్నది... స్వామి...లేదా పక్కన వున్నా కోట్లపల్లికి వెళ్ళాలి అక్కడ తవ్వువా ధరకు ఇస్తున్నారు నిత్యావసరుకులు.. స్వామి ఏమైనా గిరిస్వామి ఆఫీస్ లో నిత్యావసరుకులు ఏమైనా రాబోయే కాలంలో.. ప్రజలకు కొంచెం తక్కువలో నిత్యావసరుకులు ఇస్తే బాగుటుంది స్వామి.. మా లాంటి నిరుపేదలకు. అనునిత్యం .. తలుచుకుంటాము స్వామి... ఇట్లు ....... మీ శెట్టిపల్లి


[06:41, 1/6/2026] GIRI SWAMY గ్రామస్తులు ఈ విషయం లో ఎంతమంది ముందుకు వచ్చారు ? కనీసం 1000 మంది ముందుకు వస్తే .. శెట్టిపల్లి రేషన్ షాప్ సరికొత్త రూపం లో ఏర్పాటు చేద్దాం .. ప్రతి నెల 1 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది ... అన్ని సరకులు తక్కువ ధరలో ఇద్దాం. కానీ షరతు ... శెట్టిపల్లి అభ్యుదయ వేదిక వద్ద అందరు వచ్చి సాయంత్రం పూట ఈ విషయం చర్చించాలి. గ్రామస్తులు అడిగితె శెట్టిపల్లికి ఏదైనా తీసుకు రావచ్చు, తెస్తాను కూడా .. కానీ అడగకుండా అంగిడి పెడితే ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది. అలోచించి ... వచ్చే ఆదివారం సాయంత్రం సమావేశానికి రండి.